Song Details
Lyrics
నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం నాలో ఆలాపన ఆగేనా ఆపిన ఎదలో లయ వినవా ప్రియా నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం చరణం: 1 చెరువా దూరము లేవులే ఇష్టమైన ప్రేమలో ఆశలే కంటిలో బాసలై ఇష్టమాయే చూపులే కోపతాపాల తీపి శాపాల ముద్దు మురిపాల కథ ఇష్టమే ఎంత అదృష్టమో మన ఇష్టమే ఇష్టము నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం నా నువ్వైతే నాకిష్టం చరణం: 2 ఎగసే ఆ గువ్వల కన్నా మెరిసే ఆ మబ్బుల కన్నా కలిసే మనసేలే నాకిష్టం పలికే ఈ తెలుగులా కన్నా చిలికే ఆ తేనెల కన్నా చిలకా గోరింకకు నువ్విష్టం ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే అందాల పాటల్లో నీ పల్లవిష్టం నువ్వంటే ఎంతిష్టం... నీ ప్రేమంటే అంతిష్టం... నేనంటే నాకిష్టం... నాకన్నా నువ్విష్టం....
Lyrics sourced from public databases. May contain errors.