Song Details
Lyrics
చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్త బంధాలిలా ఈ రెండు దీపాలుగా ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదె కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే వెలిగించుకో వేలుగా కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా ఆ అందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వునా నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
Lyrics sourced from public databases. May contain errors.