MovieGQ

Osi Manasa Neeku Thelusa

Neti Siddhartha (1990) · Track 1 of 5

Lyrics

పల్లవి: ఓసి మనసా... నీకు తెలుసా... మూగ కనులా... ఈ గుస గుసా... ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ తనువంతా వేణువూదిందీ కన్నె ఊపిరీ ఈ లావాదేవి ఏనాటిదీ... ఓ ఓ హో ఓసి వయసా... ఇంత అలుసా... నీకు తగునా... ఈ గుస గుసా... మరుమల్లెల్లోనా పుట్టింది కొత్త ఆవిరీ మసకేసే ముందే సాగింది గుండె దోపిడీ ఈ గిల్లి కజ్జా ఏనాటిదీ... ఓహో హో హో ఓసి మనసా.... నీకు తెలుసా... చరణం: 1 నింగి నేలా వంగీ పొంగీ సయ్యాటాడే ఎందుకోసమో చూపులో సూర్యుడే పండినా సందెలో కొండాకోనా వాగూవంకా తుళ్ళింతాడే ఎంత మోహమో ఏటిలో వీణలే పాడినా చిందులో తొలిగా గిలిగిలిగా అలిగే వేళలో పసి తుమ్మెదొచ్చి వాలింది గుమ్మ తేనెకీ సిరితీగ పాపా ఊగేది తీపి కాటుకే అహ ప్రేమో ఏమో ఈ లాహిరీ ఓ హో హో అహా హా... ఓసి వయసా... ఇంత అలుసా... చరణం: 2 తుళ్ళి తుళ్ళి తూనీగాడే పూతీగల్లో ఎందుకోసమో గాలిలో ఈలలా పూలలో తావిలా హోయ్ మల్లిజాజి మందారాలా పుప్పొల్లాడే ఏమి మాసమో కొమ్మలో కోయిలా రాగమే తీయగా ఒడిలో అలజడిలే పెరిగే వేళలో కనుపాపలాడుకుంటాయి కౌగిళింతల్లో చిరునిద్దరైన పోవాలి కొత్త చింతల్లో ఈడొచ్చాక ఇంతే మరీ ఆహా... హా హా హా హా ఓసి మనసా ... నీకు తెలుసా... నీకు తగునా... ఈ గుస గుసా... ఎద లోయల్లోన సాగింది కొత్త తాకిడీ మసకేసే ముందే సాగింది గుండె దోపిడీ ఈ లావాదేవి ఏనాటిదీ ఓ ఓ హో ఓసి వయసా... ఇంత అలుసా... ఓసి మనసా... నీకు తెలుసా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Neti Siddhartha

See All