Song Details
Lyrics
పల్లవి: చిలక పచ్చకోక పెట్టినాది కేక చిలక పచ్చకోక పెట్టినాది కేక తోడులేక బలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినాది కాక పంచుకోవే పాలమీగడ రారా ఉల్లాస వీరుడ నీ సోకు మాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్కా ఇస్తావా ముంత మామిడి చిలక పచ్చకోక పెట్టినాది కేక చరణం: 1 చంపకమాల చంపకే బేలా చాటుముద్దులో ఉంది ఘాటు మసాలా కొంటె గోపాల ఆపరగోల సరసానికి ఉందిరయ్యో వేళాపాల వద్దకొచ్చేసి హద్దు ఉందంటే తిక్క రెచ్చిపోదా ఒసేయ్ తూగుటుయ్యాలా వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిగా మురళీలోల పిల్లచూస్తే జామకాయలే దీని తస్సదియ్య కొరకబోతే మిరపకాయలే చెయ్యేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే చిలక పచ్చకోక పెట్టినాది కేక తోడులేక బలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినాదే కాక పంచుకోవే పాలమీగడ చరణం: 2 నిన్ను చూశాకే వెన్ను మీటాకే ఆడతనం లోని సుఖం తెలిసిందయ్యో చెంగు పట్టాకే చెంపగిల్లాకే మోజువేటలో మజా మరిగానమ్మో పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్లకావాలా చెంత చేరాకే చిందులెయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలే ఏడూళ్ల అందగత్తెని నీ సోకు మాడ ముట్టుకుంటే అత్తిపత్తిని హా రావే నా సోంపాపిడి నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి చిలక పచ్చకోక పెట్టినాది కేక చిలక పచ్చకోక పెట్టినాది కేక తోడులేక బలకృష్ణుడా హో రెండు జడ్ల కైక రెచ్చినాదే కాక పంచుకోవే పాలమీగడా రారా ఉల్లాస వీరుడా నా సోకు మాడ నీదే నా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నా తస్స చెక్కా ఇస్తావా ముంత మావిడి రారా ఉల్లాస వీరుడా నా సోకు మాడ నీదే నా పట్టు పావడా హొయ్
Lyrics sourced from public databases. May contain errors.