MovieGQ

Sainika

Naa Peru Surya Naa Illu India (2018) · Track 1 of 6 · 4:20

Lyrics

సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటినిండుగా నిదురపోదురా నిదురపోదురా నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే జాతి భావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక దేహంతో వెలిపోదే కథ దేశంలా మిగులుతుందిగా సమరం ఒడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగ చదివే తరములకు నువ్వో స్పూర్తి సంతకం పస్తులు లెక్కపెట్టవే ఓ సైనిక పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక గస్తీ దుస్తులు సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెగువగు ధీరుడివని బలమగు భక్తుడనే వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మింది ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా నువ్వో మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బ్రతుకే వందేమాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naa Peru Surya Naa Illu India

See All