MovieGQ

Idi Naa Priya Narthana Vela

Mayuri (1985) · Track 3 of 7

Song Details

Lyrics

పల్లవి: అందెలు పిలిచిన అలికిడి లో అణువణువున అలజడులూ యద పదమొకటౌ లాహిరిలో... ఎన్నడు ఎరగని వురవడులూ ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ.. చరణం: 1 ఉత్తరాన ఒక ఉరుము వురిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా ఉత్తరాన ఒక ఉరుము వురిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా ఒక కదలిక చిరు మెదలిక..గిలిగింతగ జనియించగా ఒక కదలిక చిరు మెదలిక..గిలిగింతగ జనియించగా నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ.. చరణం: 2 మేఘ వీణ చలి చినుకు చిలికినా మేను లోన చిరు అలలు కదలినా మేఘ వీణ చలి చినుకు చిలికినా మేను లోన చిరు అలలు కదలినా ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా ఒక లహరిక మధు మదనిక వలవంతగ జనియించగా సుగమ నిగమ సుధ ఎదల పొంగగా వరదలాగా ఉప్పొంగనా సుగమ నిగమ సుధ ఎదల పొంగగా వరదలాగా ఉప్పొంగనా వరాళి ఎదలొ స్వరాల రొదలో స్వరము పాడనా ఆడ నా ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mayuri

See All