Song Details
Lyrics
హొయ్ నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే నీ అడుగు అడుగున తోడుంటా నాతో వస్తావా ఏడడుగులింక నను నడిపిస్తే నీతో వస్తాలే ఆకాశమైన అరచేతికిస్త మరి నాతో వస్తావా హొయ్... గోరి గోరి గోరి గోరి గోలుకొండ ప్యారీ రావె నా సంబరాల సుందరి హేయ్... చోరి చోరి చోరి చోరి చేయజారకో హరి నీదే సోయగాల చోకిరి చరణం: 1 మదిలో మెదిలే ప్రతి ఆశా నువ్వు ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు హృదయం ఎగిసే ప్రతి శ్వాసా నువ్వు నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు రేయి పగలు నా కంటిపాపలో నిండినావె నువ్వే అణువు అణువు నీ తీపి తపనతో తడిసిపోయే కలలే హేయ్... గింగిరాల బొంగరాల టింగురంగసాని రావే నా జింగిలాల జిగినీ హే... రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి మెళ్ళో నీ తాళిబొట్టు పడనీ హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా చరణం: 2 అరెరే అరెరే తేనూరే పెదవి మెలికే పడని నను నీలో పొదివి పడితే నదిలా వరదయ్యే నడుము పరదా విడనీ నీదయ్యే క్షణము పరువమెందుకీ పరుగులాటవే పరుపు చేరు వరకూ పడుచు వయసులో అంచు పైటలే బరువులాయె నాకు హోయ్... చెంతకింక చేర చేర సిగ్గులెందుకోరి రావే నా బంతిపూల లాహిరి హోయ్... చెంగులోన దూరి దూరి గింగురెత్తిపో హరి కొంగే గొడుగెత్తుకుంది జాంగిరీ హాయ్ నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకే ఇస్తా నాతో వస్తావా నీతో వస్తాలే నీతో వస్తాలే నీ గుండెల్లోన గూడే కడితే నీతో వస్తాలే
Lyrics sourced from public databases. May contain errors.