Song Details
Lyrics
ఇందురూడు చందురూడు సూపుతోనే సూది గుచ్చి చంపుతాడు అందగాడు అందగాడు మాటతోనే మత్తుమందు చల్లుతాడు నువ్వే నవ్వి చురకేసే పిల్లగాడు కమ్మగా చిటకా చేసి చుట్టూ తిప్పుకున్నాడు మెల్లంగా మీసం దువ్వి మెలికేసే తుంటరోడు చల్లంగా మస్కా కొట్టి మనస్సే గుంజుతున్నాడు వాలు చూసి వీలుచూసి ముగ్గులోకి దించినాడు కొలికేస్తే వేలికేసె మాయదారి సచ్చినోడె ఓ అమ్మో ఓరయ్యో లేలేత గుమ్మడిపండే నా సొగసు వెన్నెల్లే కరిగించి పులుసల్లే మరిగించాడే ఈ వయస్సు ఇంతందం ఎదురొచ్చి జివ్వంటూ లాగేస్తే ఆగేదెలా మొహమాటం వదిలించి మోజంతా కాజేస్తా ఈవేళ అబ్బ ఏమి చెప్పనమ్మ సుప్పనాతి సూపులోడె పట్టు చెంగు ఒంటి నిండా కప్పుకుంటే ఊరుకోడె కందిరిగ నడుముకాడ తేనెకాటు వేసినాడె పట్టుపగలు పిట్టసోకు కొల్లగొట్టి పోకిరోడె ఓయమ్మో చిలకమ్మో చెయ్యి అయినా వేయ్యకముందే గిలిగింతా నీదుడుకే చూస్తుంటే సిగ్గేదో కమ్మిందమ్మా ఒళ్ళంతా ఇన్నాళ్ళు ఊరించి ఈనాడే సిగ్గంటే రేగెదెలా ముద్దుల్లో ముంచెత్తి నీదోద కుచ్చిల్లే లాగాలా అయ్యోరామ ఇంతలోన ఎంతపని చేసినాడె అందులోని ఇందులోని అంతులేని పెద్దరోడే కొంతకాలం ఆగమన్నా ఆగలేని కోడెగాడే కోడికూత వేళ లోపే కొంప ఇట్టా ముంచినాడే
Lyrics sourced from public databases. May contain errors.