MovieGQ

Kita Kita Talupula

Manasantha Nuvve (2001) · Track 3 of 8

Song Details

Lyrics

కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాక కమ్మని కలలో అయినా నిను చూడలేదే నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంక రెప్పపాటైనా లేక చూడాలనుందే నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం కంట తడి నాడు నేడు చెంప తడి నిండే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతం అయిపోలేదా ఆవేదనంతా ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం రెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ ప్రేమ...ప్రేమ (3)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manasantha Nuvve

See All