Song Details
Lyrics
ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది హా ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది మహ ముద్దుగా ఉంది నా రూపు నాకే అద్దంలో చూస్తుండగా నువ్వు చేరినట్టుంది కనుపాపలోకి నిద్దర్లో నేనుండగా నువ్వలా కొంటెగా తొంగి చూస్తే ఎలా సిగ్గుగా ఉండదా చీర మార్చేదెలా హో ల ల ల ల ల... హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది ఈ వేళ ఏమైందో ఈ గాలి ఏదో రాగాలు తీస్తున్నది ఈ నేలపై ఉన్న పాదాలకేవో పాఠాలు చెబుతున్నది ఊరికే ఇక్కడే ఉండిపోకన్నది కోరికె రెక్కలై ఎగరవేయన్నది హో ల ల ల ల ల... ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది హా ఉండుండి ఆ సవ్వడి గుబులేదో రేపింది హే ధిన్ ధిన్ ధినక్ సందడి గుండెల్లో రేగింది
Lyrics sourced from public databases. May contain errors.