Song Details
Lyrics
పల్లవి: నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా.. నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా... కృష్ణయ్యా వేణువు విందామని నీతో వుందామని... నీ రాధా వేచేనయ్యా రావయ్యా... ఓ.... గిరిధర... మురహర... రాధా మనోహరా... నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా..రావయ్యా.. చరణం: 1 నీవు వచ్చే చోట... నీవు నడిచే బాట మమతల దీపాలు వెలిగించాను మమతల దీపాలు వెలిగించాను కుశలము అడగాలని... పదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించాను ఓ....ఓ.... గిరిధర... మురహర... నా హృదయేశ్వరా.. నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా నీ రాధ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా.... కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా.... చరణం: 2 నీ పద రేణువునైనా... పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించానూ..బ్రతుకే ధన్యమని భావించానూ నిన్నే చేరాలని... నీలో కరగాలని... నా మనసే హారతిగా వెలిగించానూ.. గోవిందా గోవిందా గోవిందా .... గోపాలా.......
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mallepoovu
See AllYemi Lokam Yemi Swardham
Kousalya Sr, S.P. Balasubrahmanyam, V. Ramakrishna
Maalish Maalish Jum Bamba
Chakravarthy
Malle Puvvula Vasantham
S.P. Balasubrahmanyam
Chinna Mata Oka Chinna Mata
P. Susheela
Chaka chaka Sage Chakkani Bullemma
S.P. Balasubrahmanyam, P. Susheela
O Priya Marumalleyakanna Thellanidhi
S.P. Balasubrahmanyam
Oho Lalitha Naa Prema Kavitha
S.P. Balasubrahmanyam, P. Susheela
Yevariki Thelusu Chithikina Manasu
S.P. Balasubrahmanyam
Yevvaro Yevvaro Ee Neraladige Varevvaro
S.P. Balasubrahmanyam