Song Details
Lyrics
పల్లవి: చక చక సాగే చక్కని బుల్లెమ్మా మిస మిస లాడే వన్నెల చిలకమ్మ నీ పేరేమిటో .. నీ ఊరేమిటో నీ పేరేమిటో .. నీ ఊరేమిటో గలగల పారే ఏరే నా పేరూ పొంగులు వారే వలపే నా ఊరూ చినదాననూ..నే చినదాననూ చినదాననూ..నే చినదాననూ చరణం: 1 కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా? కన్నులు చెదిరే.. వన్నెల చిలకా..నీ వయసే ఎంతా? చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా..ఊహకు రానంత.. అందీ అందక ఊరించే నీ మనసు లోతెంతా..హా ! మమతే ఉంటే.. ఏ ఏ.. దూరమెంతో లేదూ నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది కసి కసి చూపులు చూసే సోగ్గాడా ముసి ముసి నవ్వులు విసిరే మొనగాడా నీ పేరేమిటో .. నీ ఊరేమిటో నీ పేరేమిటో .. నీ ఊరేమిటో పదమును పాడే వేణువు నా పేరూ మధువులు చిందే కవితే నా ఊరూ చినవాడనూ..నే నీవాడనూ చినవాడనూ..నే నీవాడనూ చరణం: 2 వరసలు కలిపే.. ఓ చినవాడా..నీ వలపే ఎంతా? విలువే లేనిది..వెలకే రానిది..వలపే కొండంత..నా వలపే జీవితమంత నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా..హో గుండెల గుడిలో దేవివి నీవంటా.. సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా చల్లని గాలీ సన్నాయి ఊదిందీ పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ కల నిజమైనదీ.. ప్రేమ ఋజువైనదీ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Mallepoovu
See AllYemi Lokam Yemi Swardham
Kousalya Sr, S.P. Balasubrahmanyam, V. Ramakrishna
Maalish Maalish Jum Bamba
Chakravarthy
Nuvvu Vastavani Brindavani
Vani Jairam
Malle Puvvula Vasantham
S.P. Balasubrahmanyam
Chinna Mata Oka Chinna Mata
P. Susheela
O Priya Marumalleyakanna Thellanidhi
S.P. Balasubrahmanyam
Oho Lalitha Naa Prema Kavitha
S.P. Balasubrahmanyam, P. Susheela
Yevariki Thelusu Chithikina Manasu
S.P. Balasubrahmanyam
Yevvaro Yevvaro Ee Neraladige Varevvaro
S.P. Balasubrahmanyam