Song Details
Lyrics
సుఖీభవ సుమంగళి సుఖీభవా... సుశీలవై చిరాయువై సుఖీభవా... ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ సుఖీభవ సుమంగళి సుఖీభవా... సుశీలవై చిరాయువై సుఖీభవా... చరణం : 1 శతమానం భవతి అని నిన్ను దీవించి గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాగించి ఆ కుంకుమరేకుల కెంపులు పూయగా ఆ పూసిన పువ్వుల నోములు పండగా కదలి రావమ్మా... ఆ... ఆ... ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ సుఖీభవ సుమంగళి సుఖీభవ సుశీలవై చిరాయువై సుఖీభవ చరణం : 2 ఆనురాగం కోవెలలో ఆది దంపతులై కనులారా మిము చూసే జన్మధన్యమై ఒక జీవితకాలం చాలని ప్రేమలో సుఖశాంతులు విరిసే చల్లని తల్లిగా నిలిచిపోవమ్మా... ఆ... ఆ... ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేననీ నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మనీ సుఖీభవ సుమంగళి సుఖీభవా... సుశీలవై చిరాయువై సుఖీభవా...
Lyrics sourced from public databases. May contain errors.