MovieGQ

Punyabhoomi Naa Desham

Major Chandrakanth (1993) · Track 4 of 7

Song Details

Lyrics

పల్లవి : పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి నన్ను కన్న నా దేశం నమోనమామి అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి మహా మహుల కన్నతల్లి నాదేశం మహోజ్వలితచరితగన్న భాగ్యోదయ దేశం నాదేశం పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి చరణం: 1 అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే మానవతుల మాంగల్యం మంటగలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు... సార్వభౌముడు... అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన్న అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన అడుగో అరి భయంకరుడు కట్టబ్రహ్మన్న అది వీరపాండ్య వంశాంకుర సింహగర్జన ఒరేయ్ ఎందుకు కట్టాలిరా శిస్తు నారుపోశావా నీరుపెట్టావా కోతకోశావా కుప్పనుర్చావా ఒరేయ్ తెల్లకుక్కా... కష్టజీవుల ముష్టిమెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్యపోరాటమెంచి ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి నన్ను కన్న నా దేశం నమోనమామి అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి చరణం: 2 అదిగదిగో... అదిగదిగో... ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి అగ్గిపిడుగు అల్లూరి... ఎవడురా నా భరతజాతిని కప్పమడిగిన తుచ్ఛుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా బడుగుజీవులు భగ్గుమంటె ఉడకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల గండ్రగొడ్డలి పన్ను గడతది చూడరా అన్నా ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టిముట్టి మందిమార్బలమెట్టి మరఫిరంగులెక్కుపెట్టి వందగుళ్ళు ఒక్కసారి పేల్చితే వందేమాతరం... వందేమాతరం... వందేమాతరం... వందేమాతరం... వందేమాతరం అన్నది ఆ ఆకాశం అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరతజాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వాతంత్య్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందు ఫౌజు జైహిందని నడిపాడు గగన శిలలకెగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్... సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్... సుభాష్ చంద్రబోస్ గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమరజ్యోతిలై వెలిగే ధ్రువతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి నన్ను కన్న నా దేశం నమోనమామి అన్నపూర్ణ నాదేశం సదాస్మరామి

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Major Chandrakanth

See All