Panchadhara Bomma
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Anuj Gurwara
Lyrics
- పంచదారా బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఎమవుతానమ్మా
నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా
నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా...
పువ్వుపైన చెయ్యెస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వనిపంపిందే
నువ్వు రాకు నా వెంటా ఈ పువ్వు చుట్టూ ముల్లంటా
అంటుకుంటే మంటే ఒళ్ళంతా
తీగ పైన చెయ్యెస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపువెంట ఉరుమంటా ఉరుము వెంట వరదంటా
నే వరదలాగ మారితే ముప్పంటా
వరదైనా వరమని వరిస్తానమ్మా అ అ అ
మునకైనా సుకమని వడేస్తానమ్మా అ అ అ
నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా...
గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఉపిరైయ్యిందీ నేల నన్ను నడిపిందీ
ఎవిటంట నీలో అది గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతమెందుకు నా పైనా...
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది
వాటితోటి పోలిక నీకేలా
అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా
నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా
నువు అందకపోతే వృధా ఈ జన్మా...
Magadheera
Movie More SongsPanchadhara Bomma Keyword Tags
-
-