Dheera Dheera Dheera
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- M.M. Keeravani
Lyrics
- ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
అసమాన సాహసాలు చూడ రాదునిద్దుర
నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
సఖి సా... సఖి
ఆఆ ఆఆఆఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆ
సమరములో దూకగా చాకచక్యం నీదేరా
సరసములో కొద్దిగా చూపరా
అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా
అధిపతినై అదికాస్తా దోచేదా - మ్ మ్ మ్ మ్
పోరుకైన ప్రేమైకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా
ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర
ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొర
సువెరాహియా... హో సువెరాహియా... హో
సువెరాహియా... హో సువెరాహియా... హో
శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో ఖడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంతు తడితే అంతేగా
అణువనువూ స్వర్గమే ఐపోదా
శాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరశాలలోని ఖైదు కాని కాంక్షవుందిగ
శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నను చేరుకుందిరా
గుండెలో నగార ఇక మోగుతోందిరా
నవ సోయగాలు చూడ చూడ రాదునిద్దుర
ప్రియ పూజలేవో చేసుకోన చేతులారా సేదతీర
ధీర ధీర ధీర మనసాగలేదురా
ధీర ధీర ధీర మనసాగలేదురా
Magadheera
Movie More SongsDheera Dheera Dheera Keyword Tags
-
-