Song Details
Lyrics
పల్లవి : అహ అహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లేలే అని... జిల్లుమని చల్లని పవనం ఆ వెనకే వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రా రమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8) చరణం: 1 రోజంతా అంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటె చేష్టలు పెద్ద్దోళ్లే ఇంటా బయటా మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎండైనా వానైనా ఏం తేడాలేదు ఆగవండి మా కుప్పిగంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8) చరణం: 2 సాయంత్రం అయితే చాలు చిన్నా పెద్దా రోడ్డు మీదనే హస్కు వేయడం దీవాలీ హోలీ క్రిస్టమస్ తేడా లే దు పండగంటే పందిళ్లు వేయటం ధర్నాలు రాస్తారోకోలెన్నవుతున్నా మమ్ము చేరనేలేదు ఏ క్షణం మా ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల రంగుల రంగుల జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)
Lyrics sourced from public databases. May contain errors.