Song Details
Lyrics
అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ తలపుని తరుముతోంది వయసుకేమయింది నీ వలనే ఇదిలా మొదలయిందే నా మాటే వినదే... ప్రేమా... ఏ? నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా... ఏ? నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు చరణం: 1 జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే కాలముని కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాషయితే చిరునవ్వే కవితౌతుందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా ఔతోందే చరణం: 2 మాములుగా అనిపిస్తుందే నువ్వు వస్తే మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే మంటవలె వెలుగిస్తావే దూరముంటే మంచువలె లాలిస్తావే చేరువైతే విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అందం నువ్వు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం నీ వలనే ఇదిలా జరిగిందే
Lyrics sourced from public databases. May contain errors.