MovieGQ

Tanjavuru

Legend (2014) · Track 4 of 6

Song Details

Lyrics

సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లే గౌరీశంకరులల్లే మీరు ఒకటవ్వాలి నింగి నీలం రంగల్లే వెలుగు దీపానికిమల్లే పాలుతేనే ఆలుమగలై కలిసుండాలి హోయ్ పట్టుచీర బాగుందే కట్టుబొట్టు బాగుందే చుట్టూ ముట్టే తెలుగందంలో అయస్కాంతం దాగిందే హోయ్ పైట చెంగు బాగుందే పిట్టా నడుము బాగుందే కుచ్చిళ్ళలో కులుకే చూసి నాగుండే ఆగిందే హో నీకోసంగా పుట్టిన అందం నీదే కావాలి నీ చూపుల్తో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి ఇందా అంటు నువ్విస్తుంటే ఇంకేంకావాలి నీ ఇంగువ సొగసుల ఘుమ ఘుమ చూసి వచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేశావే ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే వయసే విరబూసే వడగాలై వచ్చేశావే నీటిలో కాగితం పడవలా దూసుకొస్తుందే అశే నీవైపే నడుమొంపులో ఒదిగే కడవలా వాలిపోయావే పిలిచే లోపే హోయ్ గుండెసడి గుఱ్ఱం లాగా దూకిందే నీపైకే కళ్ళెమొదిలేశా నేనే కావాలనే ఓయ్ కట్టు తెగి తూఫానయ్యే కడలంటి నువ్వేలే అదుపు దాటి ఆక్రమించు అస్సలు ఆపను నిన్ను తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేశావే ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే వయసే విరబూసే వడగాలై వచ్చేశావే ఎండలో నట్ట నడి ఎండలో కాలుమోపొద్దే కందిపోయేలా నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాగా నాకు భయమేలా అరే రాతిరికి గంతలు కట్టి నలుపంత దోచేసి కాటుకలు దిద్దేస్తానే నీ కళ్ళకి హేయ్ సూర్యుడికి ముసుగే వేసి దూరంగ గిరవాటేసి కాలమంత గడుపుకుంటా నీ వెలుగులో పడకేసి తంజావూరు బొమ్మల్లే భలే ముద్దొస్తున్నావే మనసే మడతేసే మాయాజాలం చేశావే ఏయ్ అత్తాపూరు అత్తరు నాపై జల్లేస్తున్నావే వయసే విరబూసే వడగాలై వచ్చేశావే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Legend

See All