MovieGQ

Sriramuni Charithamunu Thelipedhamamma

Lavakusa (1963) · Track 23 of 38

Song Details

Music Director
Lyricist

Lyrics

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా చెలువు మీర పంచవటి సీమలో తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరె రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగొనె రావణు చెల్లి ముకుచెవులు కోసె సౌమిత్రి రోసిల్లి రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయె మాయలు పన్ని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ఆ... నాథా...రఘునాధా...పాహి పాహి పాహి అని అశోకవనిని శోకించే సీత పాహి అని అశోకవనిని శోకించే సీత దరికి జని ముద్రికనిడి తెలిపె విభుని వార్త ఆ జనని శిరోమణి అందుకొని పావని ఆ జనని శిరోమణి అందుకొని పావని లంక కాల్చి రాముని కడకేగెను రివ్వు రివ్వు మని శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి దశరథసూనుడు లంకను డాసి దశకంఠు తలలు కోసి అతని తమ్ముని రాజుని చేసి సీతను తెమ్మని పలికె చేరవచ్చు ఇల్లాలిని చూసి శీలపరీక్షను కోరె రఘుపతి అయోనిజపైనే అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్ష పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకె సీత కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా వినుడోయమ్మా వినుడోయమ్మా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి రామ సుగుణధామా రఘువంశజలధిసోమా శ్రీరామా సుగుణధామా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా శ్రీరామా సుగుణధామా మందస్మిత సుందర వదనారవింద రామా ఇందీవర శ్యామలాంగ వందితసుత్రామా మందార మరందోపమ మధురమధురనామా మందార మరందోపమ మధురమధురనామా శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా శ్రీరామా సుగుణధామా అవతారపురుష రావణాధి దైత్యవిరామా నవనీత హృదయ ధర్మ నిరతరాజలరామా పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా శ్రీరామ సుగుణధామా రఘువంశజలధిసోమా సీతామనోభిరామా సాకేతసార్వభౌమా సీతామనోభిరామా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Lavakusa

See All
SV

Sri Vidhyam Jagatham (Slokam)

Ghantasala

NK

Navarathnojwala Kanthivanthamidhi (Padyam)

Ghantasala

JJ

Jaya Jaya Rama Srirama

J.V. Raghavulu, Sarojini

RR

Ramanna Ramudu Kodandaramudu

P. Susheela, K. Rani

SM

Sapthaswaradha Marudam (Slokam)

Ghantasala

VC

Virise Challani Vennela

S. Janaki

RS

Ravanu Samharinchi (Padyam)

Ghantasala

MI

Muddhumomu Itu Thippe Pilla

Ghantasala, Jikki

OM

Ollanori Mama Nee Pillani

J.V. Raghavulu, Ghantasala, Jikki, K. Rani

YM

Ye Mahaneeya Sadhvi (Padyam)

Ghantasala

YN

Ye Nimishaniki Yemi Jaruguno

Ghantasala

IB

Inthaku Bunivachhi (Padyam)

Ghantasala

AD

Apavadha Dushithayaina (Padyam)

P. Susheela

PM

Prathidhina Menu Tholadhollutha (Padyam)

Ghantasala

RR

Rajata Rajadharmamata (Padyam)

S. Varalakshmi

KT

Kannularaga Thudhisari (Padyam)

P. Susheela

IM

Idhe Mana Ashramam (Padyam)

Ghantasala

YN

Yendhuke Naa Meedha Kopam

Pithapuram Nageswara Rao, A.P. Komala

JR

Jagadhabi Ramudu Sriramude

P. Susheela, P. Leela, Ghantasala, Mallik, P.S. Vaidehi

RK

Rama Kadhanu Vinarayya

P. Susheela, P. Leela

VK

Voorake Kanniru Nimpa Kaaranamemamma

P. Susheela, P. Leela

VV

Vinudu Vinudu Ramayana Gaadha

P. Susheela, P. Leela

SR

Sri Raghavam Dhasharadhathmaja (Slokam)

P. Susheela, P. Leela

RS

Rama Sugunadhama

P. Susheela, P. Leela

RB

Rangaru Bangaru Chengavulu (Padyam)

Ghantasala

S

Sandhehinchakumamma

Ghantasala

AY

Ashwamedha Yaganiki

J.V. Raghavulu, Madhavapeddi Satyam, Ghantasala, Sarojini, K. Rani

S(

Savanashwambidhi (Padyam)

P. Susheela

HK

Hreem Karasana Garbhithanala (Slokam)

P. Susheela

IJ

Inudashadriki Jerakunda (Padyam)

P. Leela

KN

Kadagi ne Manovakkaya (Padyam)

P. Susheela

DB

Dhakkenu Balakundani Radhambhuna (Padyam)

P. Leela

TP

Thandri Pampuna Negi (Padyam)

P. Susheela, P. Leela, Ghantasala

LK

Leru Kushalavula Saati

P. Susheela, P. Leela

SB

Sthree Bala Vruddhula Thegaveyabunuta (Padyam)

P. Susheela, P. Leela, Ghantasala

SP

Srirama Paramdhama

J.V. Raghavulu, A.P. Komala, P.S. Vaidehi, Sowmitri

RP

Ramaswami Padhambujambhu

P. Susheela