MovieGQ

Andarilaga Nenu Anthe

Kudirithe Kappu Coffee (2011) · Track 5 of 5

Lyrics

అందరిలాగా నేను అంతే అనుకోవాలా తొందర పెట్టె తోవల వెంటే వెళిపోవాలా అనుకోనిదైనా ఆలోచనా.. బాగుంది అననా ఈ భావనా నిన్నడగాలనుకుంటున్నా... నిందించాలా.. ఆనందించాలా... నో నో అటుపోవద్దు మనసా ఏంటా మత్తు అన్నా ముందే ఎన్నో చెప్పి ఏదో సరదాలెద్దు వేరే ఏమీ లేదు తప్పా అందీ కట్టు తప్పి వీలైతే కాసిని కబుర్లు కుదిరితే కప్పు కాఫీ అంటూనే చేజారింది ఇట్టే కన్ను కప్పి మాటామాట కలిపి అటుపైన మాయగొలిపి ఎంత హాయి అందే ఈ తీయనైన నొప్పి నిన్నడగాలనుకుంటున్నా... నిందించాలా.. ఆనందించాలా... అందరిలాగా నేను అంతే అనుకోవాలా తొందర పెట్టె తోవల వెంటే వెళిపోవాలా తానే నమ్మేటట్టు తనపై తానె ఒట్టు వేస్తూ అందించింది హామీ పోన్లే పాపం అంటూ త్వరగా వచ్చెయ్ అంటూ చూస్తూ పంపించాను మదిని గూడంతా ఖాళీ చేస్తూ వెళిపోయిన గువ్వల్లా నాకన్నుల్లో కలలన్నీ నీ వల్లో చిక్కాలా ఎవరి నేరమంటూ నిష్టూరమెందుకంటే కలిసి ఒప్పుకుంటే అది కూడా మంచి మాటే నిన్నడగాలనుకుంటున్నా... నిందించాలా.. ఆనందించాలా... అందరిలాగా నేను అంతే అనుకోవాలా తొందర పెట్టె తోవల వెంటే వెళిపోవాలా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kudirithe Kappu Coffee

See All