Katha Vindhuva Naa Katha Vindhuva
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...
నా కథ విందువా
చరణం: 1
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
బ్రతుకంత నీవన్న బంధాన్ని పెంచావు
అన్న అనుమాటతో అన్ని తుంచేశావు
పసుపు కుంకుమ తెచ్చి పెళ్ళి కానుకగ యిచ్చి
ఉరితాడు నా మెడకు వేయించినావు
కథ విందువా...నా కథ విందువా
చరణం: 2
తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
తొలిరేయి విరిపానుపు ముళ్ళనే పరిచింది
కసటు కోరిక మగని రూపాన నిలిచింది
నీ పేరు మెదలిన మధురాధరము పైన
చిరు చేదు చిలికింది... జీవితమె మారింది
చిరుచేదు చిలికింది... జీవితమె మారింది
కథ విందువా...నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా
చరణం: 3
శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
శీలాన్ని ఏలమున పెట్టింది స్వార్థము
తాళినే ఎగతాళి చేసింది ధనము
కాముకుల కాహుతైపోయింది మానము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము
నా పాలి నరకమై మిగిలింది ప్రాణము
కథ విందువా... నా కథ విందువా
విథికి బదులుగ నువ్వు నా నుదుట వ్రాసిన కథ విందువా...నా కథ విందువా
- పల్లవి:
Kode Nagu
Movie More SongsKatha Vindhuva Naa Katha Vindhuva Keyword Tags
-
-
-