Song Details
Lyrics
పల్లవి: ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి.. ఇదే చంద్రగిరి... శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి... చరణం: 1 తెలుగుజాతి చరితలోన చెరిగిపోని కీర్తి సిరి చెరిగిపోని కీర్తి సిరి తెలుగు నెత్తురుడికించిన వైరులకిది మృత్యువు గరి ఇదే చంద్రగిరి …. శౌర్యానికి గీచిన గిరి... ఇదే చంద్రగిరి చరణం: 2 తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో తిరుమల శ్రీ వేంకటేశు చిర దరిశన వాంఛతో ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము ఇమ్మడి నరసింహుడు నిర్మించిన దుర్గము ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా..ఆ... ఆ.. ఆ.. ..ఆ... ఆ.. ఆ ఆంధ్ర శిల్పి పనితనానికద్భుత తార్కాణముగా వెలసిన దిట స్వర్గము .. వెయ్యేళ్ళకు పూర్వము... వెయ్యేళ్ళకు పూర్వము ఇదే చంద్రగిరి …. శౌర్యానికి గీచిన గిరి.. ఇదే చంద్రగిరి చరణం: 3 ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు ఇక్కడే తిమ్మరుసు చదివి ఎదిగినాడు రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు రాజనీతి రాటుదేలి రాయల గురివై నాడు ఈ మహలే కవి గాయక పండిత జన మండల మొకనాడు ఈ శిధిలాలే గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు గత వైభవ చిహ్నములై మిగిలిన వీనాడు... ఈనాడు....
Lyrics sourced from public databases. May contain errors.