Song Details
Lyrics
పల్లవి: అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు చరణం: 1 గున్నపూత మావిళ్ళో నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ తక్కిల్లో సందెపూల గొబ్బిళ్ళో నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో వయ్యారి కొంగుమీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తె జారిపోయెనే ముక్కుమీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో చంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతినే మొగలి పొదల సెగలో ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగెనులే అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు చరణం: 2 కోకిలమ్మ వేవిళ్ళో నీ కొమ్మల్లో కోరికమ్మ కావిళ్ళో కన్నె తీపి పొక్కిళ్లో నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో జళ్ళోన పూల వీణ నీ జిమ్మదీయ మీటేసి దాటిపోకురా జాబిల్లి మచ్చ చూసి నీ తస్సాదియ్య బేరాలు మానుకోనులే ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి ఒణుకు శృతిలో వెన్నెలంత రాసుకో వెన్ను వేడి చేసుకో చలికి చిలక జతలో కనుపాపలే నిదురించని నడిరేయి నవ్విందిలే అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
Lyrics sourced from public databases. May contain errors.