Nee Bugga Pandu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ పక్క దిండు నే పంచుకుంటా
నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ పక్క దిండు నే పంచుకుంటా
వలపులో లయలే చిలిపి అల్లరులై
రేగెనే చిన దానా
నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా
నా కన్నె ఈడు నీకిచ్చుకుంటా
కనులలో కలలే రేగితే అలలై
కౌగిలే కదదాక
ముద్దకు తీరదు ఆకలీ
ముద్దుకు తీరదు నా చలీ
ప్రేమకు లేనిది ఎంగిలీ
పెదవులకున్నది తాకిడీ
తియ్యక తప్పదు నా చెలి
తియ్యని వలపుల వాకిలీ
బుగ్గ తొందర సిగ్గు తొందర
ఈ సంత ఎన్నాల్లు రా
అసలు కానుకలు కొసరేటి వేల
సిసలు దాచగలవా
నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా
నా కన్నె ఈడు నీకిచ్చుకుంటా
వలపులో లయలే చిలిపి అల్లరులై
రేగెనే చిన దానా
గుప్పెడు గుండెకు ఉప్పెనా
గుట్టుగ సంగతి చెప్పనా
ఎంతటి వారికి తప్పునా
కుంపటి వయసుల వెచ్చనా
అందరి చూపులు ఆపనీ
అప్పుడు అందం ఆపనీ
జోల పాడితే గోల ఆగునా
నీ జోలి కొచ్చేయనా
చిగురు ఊహలిక ముదిరేటి వేల
యదను దాచగలమా
నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ పక్క దిండు నే పంచుకుంటా
వలపులో లయలే చిలిపి అల్లరులై
రేగెనే చిన దానా
నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా
నా కన్నె ఈడు నీకిచ్చుకుంటా
కనులలో కలలే రేగితే అలలై
కౌగిలే కదదాక
నీ బుగ్గ పండు నే గిచ్చుకుంటా
నీ మల్లె చెండు నే గుచ్చుకుంటా
Kirayi Dada
Movie More SongsNee Bugga Pandu Keyword Tags
-
-