Holi Holi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Mano
Lyrics
- హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి
హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో
హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళిి
హోళిల రంగ హోళి
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు
ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు
ఎగిరి దూకేటి చెంగు చెంగు
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో
ఓ పాలపిట్ట శకునం నీదేనంట
ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట
చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు
కలలు కన్న కన్నె వన్నె కోరికలు
చెరువులోన తామరకుపై ఊగే
మంచు ముత్యమేమన్నది
చిన్నదాని సొంతమైన సంపంగి
ముక్కుపుల్ల నౌతనన్నది
హొహొ హొహొ అందమైన చెంప మీద
హొహొ హొహొ కెంపువోలె సిగ్గులొలికె
హొహొ హొహొ
కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుందిరో
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో
హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి
హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి
హోళి హోళి హోళి
ఓ ఏకవీర తిరుగే లేదు లేర
ఓ పూలతార వగచే రోషనార
అడుగు పడితె చాలు నేల అదురునులే
పడుచు వాలు చూపు పడిన చెదరనులే
పల్లె కూనలెదురు వచ్చి యేలేలో
యెంకి పాట పడతారులె
అచ్చమైన పల్లె సీమ పాటంటే
గుండెతోనె ఆలకిస్తలె
హొహొ హొహొ పొన్న చెట్టు నీడలోన
హొహొ హొహొ పుట్ట తేనె జొన్న రొట్టె
హొహొ హొహొ
చెంతగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో
హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి
హోళిల రంగ హోళి
హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి
హోళిల రంగ హోళి
రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు
ఆకు పచ్చాని పచ్చ రంగు
చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు
ఎగిరి దూకేటి చెంగు చెంగు
గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో
వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో
Khushi
Movie More SongsHoli Holi Keyword Tags
-
-