Cheliya Cheliya
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Jeans Srinivas
Lyrics
- చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
కోపాలు తాపాలు మనకేలా
సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేలా
ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియ చెలియా చిరు కోపమా
చాలయ్య చాలయ్య పరిహాసము
రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే
గాలి తాకంగ పూచెనులే
అయితే గాలే గెలిచిందననా
లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్న
ఉలి తాకంగ వెలిసెనులే
అయితే ఉలియే గెలిచిందననా
లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
కళ్ళల్లో కదిలేటి కలలంట
ఊహల్లో ఊగేటి ఊసంట
చెలియ చెలియా చిరు కోపమా
నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే
మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవే అనుకోమననా
లేక నైజం అనుకోనా
మౌన రాగాలు రెండు కళ్ళను ధీకొంటే
ప్రేమ వాగల్లె పొంగునులే
దీని ప్రళయం అనుకోమననా
లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంట
వ్యవహారం తీర్చేది ఎవరంట
అధరాలు చెప్పేటి కధలంట
హృదయంలో మెదిలేటి వలపంటా
చెలియ చెలియా చిరు కోపమా
Khushi
Movie More SongsCheliya Cheliya Keyword Tags
-
-