Raguluthondi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- P. Susheela
Lyrics
- పల్లవి:
రగులుతోంది మొగలి పొద
గుబులుగుంది కన్నె ఎద
రగులుతోంది మొగలి పొద
గుబులుగుంది కన్నె ఎద..
నాగినిలా వస్తున్నా
కౌగిలినే ఇస్తున్నా...
కాటేస్తావో..ఓ..ఓ... మాటేస్తావో..ఓ..ఓ..
రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
నాగశ్వరమూదేస్తా.. నాలో నిను కలిపేస్తా..
కాటేస్తాలే..ఏ..ఏ... వాటేస్తాలే..ఏ...
రగులుతోంది మొగలి పొద..వగలమారి కన్నె ఎద..
చరణం: 1
మసక మసక చీకట్లో... మల్లె పువ్వు దీపమెట్టి..
ఇరుకు ఇరుకు పొదరింట్లో... చెరుకుగడల మంచమేసి..
విరహంతో..ఓ..ఓ.. దాహంతో..ఓ..ఓ..
మోహంతో ఉన్నా ... నాట్యం చేస్తున్నా...
నా పడగ నీడలో... నీ పడక వేసుకో...
నా పెదవి కాటులో మధువెంతో చూసుకో...
కరిగిస్తాలే...ఏ..ఏ.. కవ్విస్తాలే..ఏ..ఏ..
తాపంతో ఉన్నా.. తరుముకు వస్తున్నా...
రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
రగులుతోంది మొగలి పొద.. గుబులుగుంది కన్నె
చరణం: 2
పున్నమంటి ఎన్నెల్లో... పులకరింత నీకై మోసి..
మిసిమి మిసిమి వన్నెల్లో.. మీగడంత నేనే దోచి..
పరువంతో..ఓ..ఓ.. ప్రణయంలా...ఆ..ఆ.ఆ
తాళం వేస్తున్నా.. తన్మయమౌతున్నా...
ఈ పొదల నీడలో.. నా పదును చూసుకో..
నా బుసల వేడితో... నీ కసినే తీర్చుకో..
ప్రేమిస్తావో..ఓ..ఓ.. పెనవేస్తావో..ఓ..ఓ..
పరవశమౌతున్నా... ప్రాణం ఇస్తున్నా...
రగులుతోంది మొగలి పొద.. వగలమారి కన్నె ఎద
నాగినిలా వస్తున్నా కౌగిలినే ఇస్తున్నా
కాటేస్తాలే..ఏ..ఏ... వాటేస్తాలే...ఏ..ఏ..
రగులుతోంది మొగలి పొద..ఆ.. వగలమారి కన్నె ఎద
Khaidi
Movie More SongsRaguluthondi Keyword Tags
-
-