Song Details
Lyrics
పల్లవి: గోరింట పూసింది గోరింక కూసింది గొడవేమిటే రామ చిలకా గొడవేమిటే రామ చిలకా నే తీర్చనా తీపి అలకా ఆ నే తీర్చనా తీపి అలకా గోరింక వలచింది గోరింట పండింది కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక నీ ముద్దు నా ముక్కు పుడక ఆ నీ ముద్దు నా ముక్కు పుడక ఏలో ఏలో ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలేలో ఏలో చరణం: 1 పొగడాకు తేనేంతో పొదరిల్లు కడిగేసి రతనాల రంగులతో రంగ వల్లులు తీర్చి ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే ఆ ఆ ఆ ఆ సొదలేమిటే రామచిలక సొదలేమిటే రామచిలక సొగసిచ్చుకో సిగ్గు పడక ఆ ఆ సొగసిచ్చుకో సిగ్గు పడక గోరింక వలచింది గోరింట పండింది ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా చరణం: 2 విరజాజి రేకులతో విరిసేయ సవరించి పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి నిదరంతా మింగేసే నిశిరాతిరి తోడుంటే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కొదవేమిటే గోరువంక కొదవేమిటే గోరువంక కడకొంగుతో కట్టుపడక ఆ ఆ కడకొంగుతో కట్టుపడక గోరింట పూసింది గోరింక కూసింది కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక నే తీర్చనా తీపి అలకా ఆ నే తీర్చనా తీపి అలకా
Lyrics sourced from public databases. May contain errors.