MovieGQ

Yedu Kondala Paina Yela Velisavo

Jyothi (1976) · Track 1 of 4

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో తెలియని వారికి తెలుపర స్వామి తెలియని వారికి తెలుపర స్వామి కన్నుల పొరలను తొలగించవేమి ఏడుకొండలపైన ఏలవెలిశావు ఎవరికీ అందక ఎందుకున్నావో చరణం: 1 ఆ ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో ఆ అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో ఏ అర్థమున్నదో... ఏ సత్యమున్నదో తెలియని వారికి తెలుపర స్వామి కన్నుల పొరలను తొలగించవేమి ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో చరణం: 2 పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో ఏనాటి ఋణమును తీర్చుకుంటున్నావో రెండు ప్రేమల మధ్య బండగా మారావూ స్వామి రెండు ప్రేమల మధ్య బండగా మారావూ రేపు లేని నీకు దోపిడీ ఎందుకో... తెలియని వారికి తెలుపర స్వామి కన్నుల పొరలను తొలగించవేమి ఏడుకొండలపైన ఏలవెలిశావో ఎవరికీ అందక ఎందుకున్నావో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jyothi

See All