Song Details
Lyrics
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగ అతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం తారార రారార తారార రారార తారార రారార రా ఓ తారార రారార తారార రారార తారార రారార రా ఓ ఏ వాసనలేని కొమ్మలకి సువాసన కలిగిన పూలున్నాయి పూలవాసనతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలొ ఒక చిటికెడైన ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపంలా వెలిగేటి మిణుగురులతిశయమే తనువున ప్రాణం ఏచోట నున్నదో ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో ఆలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగ అతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం అల వెనెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట నడిచొస్తే నీవే నా అతిశయము జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వొ నువ్ ఎనిమిదవ అతిశయము నింగిలాంటి నీ కళ్ళు పాలుగారే చెక్కిళ్ళు తేనేలూరె అధరాలు అతిశయమే మగువ చేతి వేళ్ళు అతిశయమే మకుటాలంటి గోళ్ళు అతిశయమే కదిలే ఒంపులు అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు ముందున్న ప్రేమేగ అతిశయం ఓ పదహారు ప్రాయాన పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగ అతిశయం ఓ పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలె అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమె అచ్చెరువొందె నీవే నా అతిశయం తారార రారార తారార రారార తారార రారార రా ఓ తారార రారార తారార రారార తారార రారార రా ఓ
Lyrics sourced from public databases. May contain errors.