MovieGQ

My Heart Is Beating

Jalsa (2008) · Track 2 of 9

Song Details

Lyrics

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ పెదవిపై పలకదే మనసులో ఉన్న సంగతి కనులలో వెతికితే దొరుకుతుందీ టీ స్పూన్ టన్ను బరువవుతుందే ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే క్లౌడ్ 9 కాళ్ళకిందకొచ్చిందే లాండ్ మైన్ గుండెలో పేలిందే దే దే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ Hey I wanna be with you forever Hey I wanna live with you forever పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా మునుపు లేని మైకానా మదిని ముంచి పోయిందా ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా తలగడతో తలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్ గన్ మోగినట్టు ఉంటుందే క్రాంప్టన్ ఫాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే దే దే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ ఎప్పుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం త్వరత్వరగా తరిమినదే పదపదమని పడుచు రథం యదలయలో ముదిరినదే మదనుడి చిలిపి రిథం గుసగుసగా పిలిచినదే మనసున మెరిసిన కలలవనం తహతహగా తరిమినదే ధమ్ రె ధమ్ అని తూలే ఆనందం ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో వెల్కం పిలుపు వినిపిస్తుందే బాణం వేసినట్టు ఏ విల్లో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే దే దే మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అదీ ఎన్నాళ్ళీ వెయిటింగ్ అనేలా తరుముతోంది మదీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jalsa

See All