MovieGQ

Yedu Rangula Indhradhanasu

Indra Dhanussu (1978) · Track 5 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు పసిడి పసుపు మేని రంగు సందె ఎరుపు బుగ్గ రంగు నీలి రంగుల కంటి పాపల కొసలలో నారింజ సొగసులు ఆకు పచ్చని పదారేళ్ళకు ఆశలెన్నో రంగులు ఆ ఆశలన్ని ఆకాశానికి ఎగసి వెలెసెను ఇంద్రధనుసై ఇంద్రధనుసై ఇంద్రధనుసై ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు ఎవ్వడే ఆ ఇంద్రధనుస్సును ఎక్కుపెట్టిన వీరుడు ఎవ్వడే నా యవ్వనాన్ని ఏలుకోగల మన్మధుడు వాడి కోసం వాన చినుకై నిలిచి ఉంటా నింగిలోనా వాడి వెలుగే ఏడురంగుల ఇంద్రధనుసై నాలో ఇంద్రధనుసై నాలో ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు ఈడు వచ్చిన నా వయసు ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగు నా మనసు మల్లె రంగు నా మనసు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Indra Dhanussu

See All