MovieGQ

Nenoka Prema Pipasini

Indra Dhanussu (1978) · Track 6 of 6

Song Details

Lyrics

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా తలుపు మూసిన తలవాకిటనే పగలూ రేయీ నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నానా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని పగటికి రేయి రేయికి పగలు పలికే వీడ్కోలు సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు నను వలచానని తెలిపేలోగా నివురై పోతాను నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Indra Dhanussu

See All