MovieGQ

Nedu Srivariki Memante Paraaka

Illarikam (1959) · Track 4 of 7

Song Details

Music Director
Lyricist

Lyrics

పల్లవి: నేడు శ్రీవారికి మేమంటే పరాకా... తగని బలే చిరాకా ఎందుకో తగని బలే చిరాకా... నేడు శ్రీవారికి మేమంటే పరాకా... చరణం: 1 మొదలు మగవారు వేస్తారు వేషాలు పెళ్లి కాగానే చేస్తారు మోసం... ఆ...ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే కోపతాపాలే రావండి పాపం కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు కోరి చేరిన మనసు చేత చిక్కిన అలుసు కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు నేడు శ్రీమతికి మాతోటి వివాదం తగువే బలే వినోదం ఎందుకో తగువే బలే వినోదం... నేడు శ్రీమతికి మాతోటి వివాదం... చరణం: 2 వారి మనసైతే వస్తారు ఆడవారు చేర రమ్మంటే రానేరారు ఆ...తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు అలుక సరదా మీకు అదే వేడుక మాకు అలుక సరదా మీకు అదే వేడుక మాకు కడకు మురిపించి గెలిచేది మీరేలే ప్రణయ కలహాల సరసాలే వినోదం నిజమే బలే వినోదం ఆ...నిజమే బలే వినోదం ఆ...నిజమే బలే వినోదం నిజమే బలే వినోదం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Illarikam

See All