Song Details
Lyrics
పల్లవి: చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు (2) ఇద్దరి మధ్య పొందిక ఉంటే రానే రావు పొరపాట్లు రానే రావు పొరపాట్లు చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు చరణం: 1 పాలూ తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలి ఓహోహో ఒహోహ్ హొఓహో ఓహోహో ఒహోహో హొహో పాలూ తేనె కలిసిన మాదిరి ఆలు మగలు ఉండాలి గువ్వల జంట కులికే రీతిగ నవ్వుల పంట పండాలీ.. నవ్వుల పంట పండాలీ చరణం: 2 కొత్త కుండలో నీరు తియ్యన కోరిన మగవాడే తియ్యన (2) కొత్త కాపురం చక్కని వరము కోరిక తీరు రయ్ రయ్యన చరణం: 3 వన్నెల చిన్నెల వలపు తోటలో పూల బాటలే వెయ్యాలి ఓహొహో ఓహో హొహో ఓహొహో ఓహో హొహో వన్నెల చిన్నెల వలపు తోటలో పూల బాటలే వెయ్యాలి అన్యోన్యంగా దంపతులెపుడు కన్నుల పండుగ చేయాలీ కన్నుల పండుగ చేయాలీ చేతులు కలిసిన చప్పట్లూ మనసులు కలిసిన ముచ్చట్లు
Lyrics sourced from public databases. May contain errors.