MovieGQ

Nee Kola Kallaku Neerajanalu

Hema Hemeelu (1979) · Track 4 of 7

Lyrics

పల్లవి: నీ కోలకళ్ళకి నీరాజనాలు ఆ వాలు చూపుకు అభివందనాలు ఈ కోపతాపాలకు... ఆ తీపి శాపాలకు ఈ కోపతాపాలకు ... ఆ తీపి శాపాలకు .. అందించనా నీకు హరిచందనాలు? నీ కోలకళ్ళకి నీరాజనాలు ఆ వాలు చూపుకు అభివందనాలు చరణం: 1 కోటేరులాంటి ఆ కొస ముక్కు... ప్రొద్దు నిద్దర లేచినట్టు ఆ బొట్టు మిసమిసలు పసిగట్టి కసిపట్టి బుసకొట్టే... పగడెత్తు పైటున్న ఆ చీరకట్టు జిగినీల జాకెట్టు... సొగసైన లాకెట్టు జిగినీల జాకెట్టు.. హో .. సొగసైన లాకెట్టు... విడిచి పెడితే బెట్టు... నా మీద ఒట్టు నీ కొంటె కవితకి... నీరాజనాలు ఆ వాడి చూపుకు... అభివందనాలు ఈ ఆపసోపాలకు... ఆ విరహ తాపాలకు... ఈ ఆపసోపాలకు... ఆ విరహ తాపాలకు .. అందించనా నేను సుస్వాగతాలు? నీ కొంటె కవితకి... నీరాజనాలు ఆ వాడి చూపుకు... అభివందనాలు చరణం: 2 నీ వలపే ...ఉసి గొలుపు... నా చెలిమే చేయి కలుపు పొలిమేరలో పిలుపు... పులకింతలే రేపు... జడలోని మల్లికలు...జవరాలి అల్లికలు చలి పెంచే కోరికలు... జాబిలితో కలయికలు ఈ ఆరుబయటా ... అందాల అల్లరులు ఈ పూట నాలో పలికించే... కిన్నెరలు కలిసిపోనా ఏరు నీరై... నేనింక నీవై .. నీవింక నేనై... నీ కోలకళ్ళకి నీరాజనాలు ఆ వాలు చూపుకు అభివందనాలు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hema Hemeelu

See All