Song Details
Lyrics
ఎందుకిలా నను వేదిస్తున్నావే ఓ ఎందుకనీ నను వెలివేస్తున్నావే నా హృదయం నీ తోడే కోరుకుందనా నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా అన్యాయంగా తోస్తుంటే నట్టేటిలో ఇలా నేనేమై పోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... ఎందుకిలా నను వేదిస్తున్నావే ఎందుకనీ నను వెలివేస్తున్నావే హో... నను నేనే వదిలేసి నువ్వే కావాలంటున్నా నాదంటూ మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్నా నేన్నీకు వద్దని నీతో నడవద్దని నీ దారే నీదని గీశావా గీతని నీ గుండెల్లో నా గుర్తుల్ని తీరాన్నే తాకిన అలలా తుడిచేస్తే... నేనేమై పోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హొ హో హో వెలుగంతా తరిమేసి చీకటిలో నను తోస్తావా గతమంతా చెరిపేసి శూన్యంలో నిలబెడతావా నాకన్నీ నువ్వని అనుకోడం పాపమా పూజించే చేతిని నరికేంత కోపమా నీ తలపుల్లో మైమరపుల్లో నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే... నేనేమై పోవాలి నిన్నేమనుకోవాలి ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం హొ హో హో ఎందుకిలా నను వేదిస్తున్నావే ఎందుకనీ నను వెలివేస్తున్నావే హే హే...
Lyrics sourced from public databases. May contain errors.