MovieGQ

Lalijo

Hare Ram (2008) · Track 5 of 6

Song Details

Lyrics

లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకో లేనంతగా ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా కాపలా కాస్తూ ఉంటాగా పాపలా నిదరో చాలింకా వేకువ దాకా దీపమై చూస్తూ ఉంటాగా కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకో లేనంతగా ఊరికే ఉసూరుమంటావే ఊహకే ఉలిక్కిపడతావే చక్కగా సలహాలిస్తావే తిక్కగా తికమక పెడతావే రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా రేయంతా వెలిగించీ రంగుల లోకాన్ని కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకో లేనంతగా ఎదురుగా పులి కనబడుతుంటే కుదురుగా నిలబడమంటావే బెదురుగా బరువెక్కిందంటే మది ఇలా భ్రమపడుతుందంటే గుప్పెడు గుండెల్లో నేనే నిండుంటే కాలైనా పెట్టవుగా సందేహాలేవీ ఆపదేం రాదే నీదాకా నేనున్నాగా కాపలా కాస్తూ ఉంటాగా పాపలా నిదరో చాలింకా వేకువ దాకా దీపమై చూస్తూ ఉంటాగా కానీ అనుకోనీ అలివేణీ ఏంకాలేదనుకోనీ వదిలేసీ వెళిపోనీ ఆరాటాన్నీ లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా జోలలో జారిపో మేలుకో లేనంతగా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hare Ram

See All