MovieGQ

Nuvvu Naa Mundunte Ninnala Chustunte

Gudachari 116 (1966) · Track 6 of 6

Song Details

Lyrics

పల్లవి: నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ చరణం: 1 ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ జింకపిల్లలా ..చెంగుచెంగుమని.. చిలిపి సైగలే చేసేవూ... నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ చరణం: 2 చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ బుగ్గపైన ..కొనగోటమీటి.. సిగ్గుదొంతరలు దోచేవూ ... నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ చరణం: 3 లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ మాటలల్లి ..మరుమందుచల్లి.. నను మత్తులోన పడవేసేవూ నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gudachari 116

See All