Song Details
Lyrics
ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పెందుకు అది తొలి పాఠం మునివేలతొ మెఘాలనే మీటెంతగా ఎదిగాం మనం పసివాళ్ళగా ఈ మట్టిలొ ఎన్నాళిలా పడిఉంటాం కునికే మన కను రెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నం ఇదిగొ నీ దారి ఇటు ఉందని సూరిడిని రా రమ్మందాం జాగో జాగొరే జాగొ జాగొ జాగో జాగొరే జాగొ జాగొ జాగో జాగొరే జాగొ జాగొ ఆకాశం నుండి సూటిగా..దూకేస్తే ఉన్నపాటుగా ఎమౌతానంటూ చినుకు అలా ఆగిందా బెదురుగా కనుకే ఆ చినుకు ఏరుగా..ఏరే వరద హోరుగా ఇంతింతై ఎదిగి ఎదిగి అంతగా తరగని సంద్రమైందిగా సందేహిస్తుంటే అతిగా..సంకల్పం నెరవేరదుగా ఆలోచన కన్న త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా జాగో జాగొరే జాగొ జాగొ జాగో జాగొరే జాగొ జాగొ ఎ పని మరి ఆసాద్యమే కాదే ఆ నిజం మహా రహస్యమా వేసే పదం పదం పదే పదే పడదొసే సవాలనే ఎదురుకొమా మొదలెట్టక ముందే ముగిసే కధ కాదే మన ఈ పయనం సమరానికి సై అనగలిగే సంసిద్దత పేరే విజయం జాగో జాగొరే జాగొ జాగొ జాగో జాగొరే జాగొ జాగొ జాగో జాగొరే జాగొ జాగొ
Lyrics sourced from public databases. May contain errors.