MovieGQ

Prema O Prema

Gokulamlo Seetha (1997) · Track 7 of 7

Song Details

Lyrics

ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వనమా - ఆ...ఆ...ఆ... వెలుగుల వరమా - ఆ..ఆ..ఆ... ఈ ఎదలో కొలువుందువు రావమ్మా ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా చరణం: 1 ఎంత మధనమో జరగకుండ ఆ పాల కడలి కదిలిందా అమృతకలశమందిందా ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలినింగి కరిగిందా నేలగొంతు తడిపిందా ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురుతొడగవ ప్రేమా అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతిచేదెపుడమ్మా ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా చరణం: 2 ఆయువంత అనురాగ దేవతకి హారతీయదలిచాడు ఆరిపోతు ఉన్నాడు మాయమైన మమకారమేదియని గాలినడుగుతున్నాడు జాలిపడవ ఈనాడు నిలువున రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా ఓ.. ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా వలపుల వనమా - ఆ..ఆ..ఆ.. వెలుగుల వరమా - ఆ..ఆ..ఆ.. ఈ ఎదలో కొలువుందువు రావమ్మా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gokulamlo Seetha

See All