Song Details
Lyrics
తళుక్ తళుక్ మని తళుకుల తార మిణుక్ మిణుక్ మని మిలమిల తార ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ... (2) హా... ఆ... లాల లాల లాలా లాలలా మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా... తళుక్ తళుక్ మని తళుకుల తార మిణుక్ మిణుక్ మని మిలమిల తార ఛమక్ ఛమక్ మని చిలిపి సితార ఓ ఓ... (2) మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా... చరణం: 1 అలలై ఎగసిన ఆశా నాట్యం చేసే వేళా అలుపే ఎరుగని శ్వాసా రాగం తీసే వేళా దిశలన్నీ తలవొంచి తొలగే క్షణం ఆకాశం పలికింది అభినందనం అదిగదిగో మనకోసం తారాగణం తళుకులతో అందించే నీరాజనం మన దారికెదురున్నదా... మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా చరణం: 2 నవ్వే పెదవులపైన ప్రతి మాట ఒక పాటే ఆడే అడుగులలోన ప్రతి చోట పూబాటే గుండెల్లో ఆనందం కొలువున్నదా ఎండైనా వెన్నెల్లా మురిపించదా కాలాన్నే కవ్వించే కళ ఉన్నదా కష్టాలు కన్నీళ్ళు మరిపించదా జీవించడం నేర్పదా... మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా కనులున్న మనసుంటే బ్రతుకంతా మనకోసం అనిపించదా బంగారు భావాల ప్రియగీతం రంగేళి రాగాల జలపాతం మనలోనే చూపించదా... లాలాల లలలాల లలలాల లలలాల లాలాల (2)
Lyrics sourced from public databases. May contain errors.