MovieGQ

Prapanchama

Gillikajjalu (1998) · Track 6 of 6

Song Details

Lyrics

ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కుడి ఎడమలు ఎరగక మన కథ సాగేనంటా జత కుదరని ఎదలకు పెరుగగ ఏదో మంటా ఎవరెవరితో ఎద రగిలితే అది మనకేమంటా కనులడిగిన కలదను తడుముతు పోదామంటా మనకు మనకు గల ముచ్చట మరునెవరు చోటెచ్చట ముడులు విడని బిగి కౌగిట తగు మనకు దొరికేనట మరి ఆలస్యం ఎంటటా... ప్రపంచమా క్షమించుమా మాకు నీతో పనేమీ లేదమ్మా తెరమరుగున నిలువక చొరవగ రారమ్మంటా అరమరికలు తెలియని చెలిమిని అందిమ్మంటా కలవర పడు గుస గుస కబురును విన్నానంటా మనసెరిగిన వరుసకు సరసనె ఉన్నానంటా ఉరుము వెనుక జడి వానలా ఈ విరహమంత కలిగేదెలా దిగులు పడకు నువ్వంతలా తొలి వలపు పెగిలె సంకెలా మరి దూరంగా ఉంటే ఎలా... వసంతమా వరించుమా స్వాగతాంజలి స్వీకరించమ్మా కాంచన కాంతులు భామ నీ కంచెలు తెంచుకు రామ్మా కాంక్షలు పెంచిన ప్రేమ నీ పంచనె మా చిరునామా ఈ ఏకాంతం మనదే స్నేహమా...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gillikajjalu

See All