Song Details
Lyrics
నింగి నేల ఉయ్యాలా నువ్వు నేను ఊగాలా జత సంగీతాల జంపాల జగమంతా మైకం నింపాల చలి సందెగాలి తందనాల తాళం వెయ్యాలా నింగి నేల ఉయ్యాలా నువ్వు నేను ఊగాలా కొండకోనల గుండు కోయిల కుహు కుహు పులకగా నీ పలకరింపులా ఎండవేళలా వెండి వానల మిల మిల చిలకగ చిరునవ్వుల కిల కిల కమ్మని సైగల వేగం అమ్మడు పువ్వును తాకి లోపల దాగిన ఊసుల వైనం బయటకి లాగి చెలరేగాల చిలిపి తనాల కన్నుల విందుల చేసిన అన్నుల మిన్నును చూసి ఒంటరి తుంటరి ఆశలు తొందర తొందర చేసి తరిమే వేళ నిను చేరేలా మన ప్రేమ యాత్ర సాగక సిరివెన్నెల పాటలా నింగి నేల ఉయ్యాలా నువ్వు నేను ఊగాలా సోకు తానుల రాకుమారిలా కన్నె కల నువ్వు అలా నను కవ్విస్తే ఎలా కోటి తారలా కాంతి ధారలా తళ తళ ఊహల నను కమ్మేస్తే ఎలా బంధువులందరి ముందర బంగరు బంధనమేసి అందిన సుందరి ఒంటికి చందన సేవలు చేసి లాలించనా రస లీలగా అల్లరి చిందులు వేసిన పిల్లడి వైఖరి చూసి మల్లెల మంచం వేసి మెల్లగ మచ్చిక చేసి పాలించినా మహారాణిలా మన కయ్యమంత చూసి కందిపోదా వెన్నెలా నింగి నేల ఉయ్యాలా నువ్వు నేను ఊగాలా జత సంగీతాల జంపాల జగమంతా మైకం నింపాల చలి సందెగాలి తందనాల తాళం వెయ్యాలా
Lyrics sourced from public databases. May contain errors.