Song Details
Lyrics
వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చరణం: 1 చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం హో తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే చరణం: 2 ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండాకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి లాలా లాలా లాలా లాలా ఆ... లాలా లాలా లాలా లాలా ఓ... లాలా లాలా లాలా...
Lyrics sourced from public databases. May contain errors.