MovieGQ

Goruvanka Vaalaga

Gandeevam (1994) · Track 3 of 6

Lyrics

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగాన పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా నల్లనల్ల నీలల్లోన ఎల్లాకిల్లా పడ్డట్టున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో అమ్మాయంటి జాబిలమ్మ అబ్బాయంటే సూరీడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో ఎవరికి వారే యమునకు వీరే రేవు నీరు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల ఇల్లా నవ్వే బాలయొచ్చీ కోళటాలాడే వేళల్లో పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గోపమొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో పరవశమేదో పరిమళమాయే హో పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gandeevam

See All