MovieGQ

Siri Siri Poola

Gandeevam (1994) · Track 4 of 6

Lyrics

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే పులకల కొమ్మా పుణ్యాలరెమ్మా పేరంటమేనాడే ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట ఊగక మన ఊయల అలిగింది ఈ పూట చరణం: 1 వేయందాలలో నెలవంకా ఈ నేలవంకా దిగివచ్చేనా శృంగారాలకే సెలవింకా జోలాలీలకే నిదురించేనా పెళ్ళినాటి తుళ్ళిపాటు తల్లినాడు సాగునా అమ్మచాటు బిడ్డముందు అయ్యగారికీపనా కలలే కన్నారు కమ్మగా ఇదిగో మీ కానుకా చిలికే వలపే మొలకై మొలిచే కనుపాపలా కనిపించెలే కలికి చిలకా ఒడినే అలికే అనురాగమే చిలికించెలే సిరి సిరి పూలా చెల్లాయి పాపా సీమంతమేనాడే ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట చరణం: 2 మా సంసారమే మధుగీతం పూసే యవ్వనా వనజాతాలే పిల్లాపాపలా అనుబంధం దాచేసిందిలే తొలిగ్రంధాలే గోకులాన పుట్టినోడు కొంగుచాటు కృష్ణుడే నందనాల అందమంత బాలకృష్ణుడొక్కడే ఎదలో ఉన్నాడు జీవుడూ ఎదురైతే దేవుడూ పలికే మురళీ తలపై నెమలీ అది పాటగ ఇది ఆటగ ప్రజలో డజనై భజనే పడితే కధ కంచికే మనమింటికే సిరిపూల చెల్లాయి పాపా సీమంతమేనాడే ఆశగా మధుమాసమే అడిగింది ఈ మాట పులకల కొమ్మా పుణ్యాలరెమ్మా పేరంటమేనాడే ఊగక మనఊయల అలిగింది ఈ పూట

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gandeevam

See All