MovieGQ

Repu Vasthanannavu

Gajula Kishtayya (1975) · Track 6 of 6

Song Details

Lyrics

రేపు వస్తానన్నావు ఈ మాపు ఎక్కడ ఉంటావు నీ కళ్ళలోనే తెల్లవార్లు కాపురముంటాను రేపటికొస్తాను రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి నిన్న ఆశలు నేడు తొడిగిన మొగ్గలౌతాయి నేటి మొగ్గలు రేపు విరిసిన పువ్వులౌతాయి కొత్త కొత్త సోయగాలు కునుకు తీస్తూ ఉంటాయి మెత్త మెత్తగ కౌగిలిస్తే మేలుకొంటాయి హాయ్ మిడిసిపడతాయి హ ఓ హ ఓ రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు ముసుగు తీయని తామరల్లే నీవు ఉంటావు ముసురు వీడిన సూర్యుడల్లే నీవు వస్తావు రేకు రేకు గడియ తీసి లేత వయసు తలుపు తెరిచి రేపు వడిలో రకరకాల రుచులు చూస్తాము తెలుసుకుందాము హ ఓ హ ఓ రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ మాపు వచ్చే కలలకు రూపు రేపులోనే ఉన్నదీ రేపు ఎంతో తియ్యనిదీ నేటి కన్నా కమ్మనిదీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gajula Kishtayya

See All