Song Details
Lyrics
నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళూ నీలా ఉండి పోతే చాలమ్మా |నవ్వులు రువ్వే| ఆకుల పయ్యెద లో నీ ఆడతనాన్ని దాచావు రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసే ఉందమ్మా |నవ్వులు రువ్వే| ఈ తోట మొత్తము కమ్మినవి నీ దోర వయసు అందాలు ఈ గాలి మత్తులో ఉన్నవి నీ కన్నె మనసులో కైపులు నువ్వొలకబోసే ఒంపుసొంపులకు ఒడిని పడతానుండమ్మా |నవ్వులు రువ్వే| ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేసేవో ఆ పాట గానో తేటి గానో పది నాళ్ళున్నా చాలమ్మా |నవ్వులు రువ్వే|
Lyrics sourced from public databases. May contain errors.